అమెరికా నుంచే భారత ముఖ్యమంత్రి పాలన

Posted on : 13/03/2018 04:48:00 pm

అమెరికాలో ఉన్నాను కదా అని అలసత్వం వహించలేదు, ఆరోగ్యం బాగోలేదని అస్సలు ఊరుకోలేదు. సెలవు పెట్టాను కదా అని రెస్టు తీసుకోలేదు. దేశం కాని దేశం నుంచి ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి శెహ్బాస్ అనిపించుకున్నారు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్. ఆయన వయసు 62 ఏళ్లు ,గత కొంత కాలంగా పారికర్  ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్నారు. ఫిబ్రవరి15వ తేదీన ఆయన ముంబై హాస్పటల్ లో చేరారు. ముంబైలోని లీలావతి హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్ని గంటల్లోనే ఆయన పనాజీ చేరుకున్నారు. ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 

బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కొన్ని రోజులకు ఆయనకు ఆరోగ్య సమస్యలు మళ్లీ ఎదురయ్యాయి దీంతో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అయితే అమెరికాకు వెళ్లే ముందు ఆయన తన మంత్రి వర్గ సహచరుల్లో ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. కేవలం ముగ్గురు బ్యూరోక్రాట్లకు పరిపాలన బాధ్యతలు అప్పగించారు. దీంతో వారే ఆయా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మనోహర్ పారికర్ వద్ద దాదాపు 20కి పైగా ముఖ్యమైన శాఖలు ఉండటం విశేషం. కీలకమైన హోం - ఆర్థికం - జీఏడీ - మైనింగ్ వంటి ప్రధాన శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి.

తాజాగా అమెరికాలో ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన నిర్ణయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకుంటామని తెలియజెప్పినట్లు సమాచారం. కేబినెట్ సమావేశం మొదలుకొని ఇతరత్రా కీలక నిర్ణయాలు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గదర్శనం  చేస్తానని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.తాజాగా అమెరికాలో ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన నిర్ణయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకుంటామని తెలియజెప్పినట్లు సమాచారం. కేబినెట్ సమావేశం మొదలుకొని ఇతరత్రా కీలక నిర్ణయాలు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గదర్శనం  చేస్తానని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.