పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ బట్ నో యూజ్

Posted on : 13/03/2018 06:05:00 pm

ఏపీ ప్రత్యేక హోదా సెగలు రోజు రోజుకీ వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎంత గొంతెత్తుతున్నా కేంద్రం తన మొండి వైఖరిని విడనాడటం లేదు అయినప్పటికీ ఏపీ ప్రతిపక్ష నేతలు ఎక్కడా పట్టువిడవకుండా కేంద్రం పై తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అవిశ్వాస తీర్మాణం మొదలు, ఎంపీల రాజీనామాలు ఇలా ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా కూడా కేంద్రం తను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తూనే ఉంది. అయితే వైసీపీ కూడా అదే స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. పట్టువదలని విక్రమార్కులలాగా వైసీపీ ఎంపీలు మంగళవారం నాడు కూడా తమ నిరసనలు కొనసాగించారు. సభను ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలపై సభలో ఏపీ ప్రత్యేక హోదా సెగలు రోజు రోజుకీ వేడిపుట్టిస్తున్నాయి. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఎంత గొంతెత్తుతున్నా కేంద్రం తన మొండి వైఖరిని విడనాడటం లేదు అయినప్పటికీ ఏపీ ప్రతిపక్ష నేతలు ఎక్కడా పట్టువిడవకుండా కేంద్రం పై తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అవిశ్వాస తీర్మాణం మొదలు, ఎంపీల రాజీనామాలు ఇలా ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా కూడా కేంద్రం తను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తూనే ఉంది. అయితే వైసీపీ కూడా అదే స్థాయిలో తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. పట్టువదలని విక్రమార్కులలాగా వైసీపీ ఎంపీలు మంగళవారం నాడు కూడా తమ నిరసనలు కొనసాగించారు. సభను ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలపై సభలో సమగ్ర - అర్థవంతమైన చర్చ జరగాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. దాంతోపాటు - రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభలో కాలింగ్ అటెన్షన్ నోటీసు ఇచ్చారు. ఏపీకి న్యాయం చేయాలంటూ పార్లమెంటు మెయిన్ గేట్ వద్ద వైసీపీ ఎంపీలు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - విజయసాయిరెడ్డి - మిథున్ రెడ్డి - అవినాష్ రెడ్డి - వరప్రసాద్ లు పాల్గొన్నారు.

పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో ఇటు ఏపీ, అటు తెలంగాణ ఎంపీలు తమ సమస్యలపై ఆందోళనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విభజన హామీలపై టీడీపీ - వైసీపీ - కాంగ్రెస్, తెలంగాణలో రిజర్వేషన్ల కోటా అంశంపై టీఆర్ ఎస్ లు పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. విభజన హామీలు నెరవేర్చాలంటూ మంగళవారం నాడు ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగించారు. ప్లకార్డులతో వెల్ లోకి దూసుకెళ్లారు. ఇటు వైసీపీ - అటు టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్ సభ వాయిదా పడింది. ఆ తర్వాత పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో ఆందోళన చేశారు. ఈ సారి మాత్రం తేదేపా ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులను ప్రదర్శించి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలవడం మరోకొసమెరుపు.