ఒక్క రోజులో సూపర్ స్టార్ కి మించిన స్టార్ అయిపోయాడు

Posted on : 13/03/2018 06:48:00 pm

అసలే సెలెబ్రెటీ ఫ్యామిలీ, ఆపై విభజన హామీల సెగ రగులుతోన్న డిల్లీ పార్లమెంట్ ప్రాంగణం, ఆ పై చేతిలో ఓ ప్లకార్డు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ, తలపండిన రాజకీయ కురువృద్ధులను సైతం ముప్పు తిప్పలు పెడుతోన్న కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకొని దేశవ్యాప్తంగా స్టార్ అయిపోయాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మనుమడు. ఏమా కథ? ఎవరా బుడతడు? ఏపీకి విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా నినాదం ఢిల్లీలో బలంగా వినబడుతోంది. పార్లమెంట్ లోపల, వెలుపులా ఎంపీలు హోదా, హామీల అమలు నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. రోజూలాగే పార్లమెంట్ బయట టీడీపీ ఎంపీలు ప్లకార్డులతో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈలోపు ఓ కుర్రాడు అక్కడికి వచ్చాడు. మెడలో పసుపు కండువా, ప్లకార్డు తీసుకొని ఎంపీల పక్కనే నిలబడ్డాడు. ఇంతలో అందరూ షాకయ్యారు. ఎవరీ కుర్రాడని తీశాక గానీ  అసలు విషయం తెలియలేదు. ఇంతకీ ఎవరీ అబ్బాయనే కదా మీ డౌటు... గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్ధార్థ్.

ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఎంపీలు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిద్దార్థ్ వచ్చాడు. ఎంపీలతో కలిసి ఇలా నిరసనలో పాల్గొన్నాడు. అయితే మీడియాతో సిద్దార్థ్ చిట్‌చిట్‌గా మాట్లాడాడట. తండ్రి వారసత్వాన్ని తీసుకొని రాజకీయాల్లోకి వస్తారా అని అడిగారట. తండ్రి వారసత్వం కాదు కాని... తాత, మామ వారసత్వాన్ని తీసుకొంటానని చెప్పాడట. అంటే సినిమాలంటే తనకు ఇష్టమని పరోక్షంగా చెప్పినట్లేనని అందరూ అనుకుంటున్నారు. మొత్తం మీద గల్లావారి వారసుడు పార్లమెంట్ దగ్గర హాట్ టాపిక్ అయ్యాడు.