ఇరవై వేల కోట్లలకు ముంచేశాడు అందుకే మోదీని ఆడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు

Posted on : 13/03/2018 07:03:00 pm

దేశాన్ని ఒక ఊపు ఊపుతోన్న అతిపెద్ద ఆర్థిక కుంభకోణం పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉదంతం నాటకీయ పరిణామాల నేపథ్యంలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కలుగుల్లో ఎలుకల్లా తవ్వేకొద్దీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జరిగిందేదో జరిగింది, పోయిందాంతో పోయిందనుకునే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు ఈ స్కాం తాలూకా తీవ్రత చిన్నదైతే కాదు లైట్ తీసుకోవడానికి విస్తుపోయే నిజాలు భయపడుతున్నాయి. అత్త సొమ్మును అల్లుడు దానం చేసిన చందంగా  ఎంత గుడ్డిగా బ్యాంకులు ప్రజల సొమ్మును దారాదత్తం చేశాయో ఈ ఉందంతం ఓ మచ్చుతునక. దీనికి సంబంధించి మరో 942 కోట్ల రూపాయలు అదనపు స్కాం తాజాగా బయటపడి మరోసారి సంచలనంగా మారింది.

అతిపెద్ద బ్యాంకింగ్‌ స్కాంగా  దేశవ్యాప్తంగా సంచలనం రేపిన  పీఎన్‌బీ కుంభకోణంలో మరిన్ని షాగింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న  మోసాల  విలువ మరింత మరింత విస్తరిస్తోంది. తాజాగా పీఎన్‌బీ స్కాం కీలక నిందితుడుగా ఉ‍న్న గీతాంజలి ప్రమోటర్‌ మె హుల్‌ చోక్సీ పై పంజాబ్‌ నేషనల్‌బ్యాంక్‌  సీబీఐ వద్ద  మరో ఫిర్యాదును నమోదు చేసింది.   అదనంగా మరో రూ.942 కోట్ల మోసాన్ని గుర్తించినట్టు తెలిపింది.   దీంతో గీతాంజలి  జెమ్స్‌ మొత్తం అక్రమాల విలువ 7 వేలకోట్లకు పై మాటే.

కాగా  మొదట్లో 12వేలకోట్లకు పైగా పీఎన్‌బీని  డైమండ్‌ వ్యాపారి నీరవ్‌మోదీ ,  చోక్సీ ముంచేసినట్టుగా పీఎన్‌బీ ఫిర్యాదు చేసింది.  ఆ తర్వాత  బ్యాంకు అందించిన సమాచారం ప్రకారం  ఈ  కుంభకోణం విలువ 13వేలకోట్లను దాటింది.  తాజా ఫిర్యాదుతో  నీరవ్‌ మోదీ గేట్‌  స్కాం మొత్తం మోసం విలువ 20వేల కోట్ల  రూపాయలను దాటేసింది. భారతీయ బ్యాంకులకు 20వేల కోట్ల రూపాయల మేర పంగనామం పెట్టిన నీరవ్ మోదీని చూసిన దేశ ప్రజలు ఆడు మగాడ్రా బుజ్జి అంటూ ముక్కు మీద వేలు వేసుకోక తప్పదు.