మీకు నచ్చినట్లు ఊరేగండి .. తెలంగాణ జోలికి మాత్రం రావద్దన్న కేటీఆర్

Posted on : 14/03/2018 09:47:00 am

సెంటిమెంట్ అనే మాట ఏపీ సీఎం కు పెద్దగా కలిసిరాలేదు. ఎందుకంటే అటు కేంద్రానికి ఏపీ పై సెంటుమెంటు లేదని తేలిపోయింది. మిత్రపక్షమనే సెంటిమెంట్ తేదేపాపై ఎన్డీయేకు లేదని తేలిపోయింది. చంద్రబాబు అక్కడితో ఆగుంటే కనీసం కుర్ర మినిష్టర్ తో అక్షింతలైనా తప్పేవి. సెంటిమెంట్ తోనే కదా తెలంగాణా ఆచ్చిందని కాస్త సెంటిమెంట్ని ఒలకబోసిన చంద్రబాబుకి తెలంగాణ ఐటీమంత్రి తెలంగాణ జోలికి రావద్దని వార్నింగ్ లాంటి సలహా ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ  ఐటీ శాఖా మంత్రి తారక రామారావు కౌంటర్‌ ఇచ్చారు. ట్విటర్‌ వేదికగా బాబుపై కేటీఆర్‌ సటైర్‌ వేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు బదులిస్తూ సెంటిమెంట్‌ కారణంగానే తెలంగాణ ఇచ్చారంటూ సోషల్‌ మీడియా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

అయితే ఈ విషయంపై కేటీఆర్‌ స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని, తమ పోరాటాన్ని నీరుగార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని అ‍న్నారు. ఎన్నో సార్లు ప్యాకేజీలు ఇచ్చి మభ్యపెట్టడానికి ప్రయత్నించినా, వాటికి ఆశపడకుండా, పట్టువిడవకుండా పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల గురించి చంద్రబాబు పోరాడవచ్చని, అంతే కానీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దంటూ హితవు పలికారు.