మూగవాడిగా నారా రోహిత్ కొత్త సినిమా

Posted on : 14/03/2018 12:45:00 pm

చూస్తుంటే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కి తెరలేపినట్లు కనిపిస్తోంది. రామ్ చ‌ర‌ణ్ చెవిటి వాడిగా, సమంత మూగదానిగా రంగ‌స్థ‌లం సినిమాలో,  ర‌వితేజ అంధుడిగా రాజా ది గ్రేట్ లో న‌టిస్తున్నారు. నారా రోహిత్ కూడా అదే తరహాలో మూగవాడిగా చేస్తున్నాడు. విభిన్నకథా, కథనాలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని, వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో నారా రోహిత్ మరో వెరైటీ రోల్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన తాజా సినిమాలో మూగవాడి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ హీరో. నారా రోహిత్ నటించబోయే పద్దెనిమిదవ సినిమా ఇది. ఈ సినిమాని శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణ రావు అట్లూరి నిర్మించబోతున్నారు. 

 ఈ సినిమాకి కథ, మాటలు వంశీ రాజేష్ అందిస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభమవుతోంది. ఈ సినిమాకు వికాస్ కురిమెళ్ళ సంగీతం సమకూర్చనున్నారు. లేడీస్ అండ్ జంటిల్‌మెన్ సినిమాకి దర్శకత్వం వహించిన పీబీ మంజునాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఆట నాదే వేట నాదే సినిమాలో కూడా నారా రోహిత్ కీలక పాత్రలో కనిపించబోతున్నవిషయం తెలిసిందే.