కాజల్ ఇద్దరినీ ప్రేమించిందట

Posted on : 14/03/2018 01:07:00 pm

అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ తో జంటగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కాజల్ ను ఎవరినైనా ప్రేమించారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తాను ఇప్పటివరకు ఇద్దరితో ప్రేమలో పడ్డానని, సినిమాల‌లో న‌టించ‌డానికి ముందు ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో పడ్డాను. హీరోయిన్ గా మారిన త‌రువాత మ‌రో వ్య‌క్తితో ల‌వ్ కలిగిందని అయితే ఇంతరవకు తాను హద్దుమీరి ప్రవర్తించింది లేదని, ఎంతో మంది హీరోలతో నటించినప్పటికీ వారితో హద్దుల్లోనే ఉన్నాని తెలిపింది. ఒక హీరోయిన్ గా ప్రేమించడం అందుకు సమయం కేటాయించడం కష్టమని అన్నారు.  ప్రేమించడానికి టైంలేనపుడు పెళ్లికి రెడీ అవలేను కదా తను ఎక్కడికి వెళ్లినా ఈ మధ్య ఇదే ప్రశ్న అడుగుతున్నారని వాపోయింది. అసలు విషయం మాత్రం బయటపెట్టలేదు తను ప్రేమించిన ఇద్దరు ఎవరనేది.