ఫ్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా ఇకలేరు

Posted on : 14/03/2018 01:28:00 pm

లెజెండ్, యమదొంగ, ఛత్రపతి వంటి ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా ఈ ఉదయం కన్నమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు తీవ్రమైన గుండె పోటు రావ‌డంతో అక్క‌డికక్క‌డే కుప్ప‌కూలిపోయి హాస్ప‌ట‌ల్ కు తీసుకెళ్లే లోపే మ‌ర‌ణించారు. తొలుత నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్‌ ప్రారంభించారు. ప‌లు యాడ్స్ లోను న‌టించారు. టెలివిజన్‌ నటుడుగా కూడా ఖ్యాతి గడించారు. 

2002లో  ఫంటూష్‌  సినిమా ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.  'గదర్', 'రాయీస్', 'మొహంజోదారో' వంటి హిందీ చిత్రాలలో నటించారు. టాలీవుడ్‌లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. సల్మాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ సినిమా రేస్-3 ఆఖరి సినిమా. నరేంద్ర ఝా మృతిపట్ల పలువురు నటీ నటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.