బెల్లకొండ సినిమాలో సాహో విలన్

Posted on : 14/03/2018 02:25:00 pm

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కతోన్న సాక్ష్యం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొగుడు కాళ్ల సుందరి పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా మేలో రిలీజ్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్‌ మరో భారీ బడ్జెట్‌లో సినమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. వంశధార క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ ను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్లో ఉంటుందట. జాతీయ స్థాయిలో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నెయిల్ నితిన్ ముకేశ్ ని విలన్ గా తీసుకుంటున్నారట. 

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా ముఖ్యం కావున ఆ బాలీవుడ్ నటుడిని దింపినట్లు టాక్. హీరోను ఓ రేంజ్ లో చూపించాలంటే అందుకు తగ్గ విలన్ ఉండాలనే కాన్సెప్ట్ తో బాలీవుడ్ నుంచి కొత్త విలన్స్ ను తీసుకొస్తున్నారు. అలా సాహో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయం కానున్నాడు నీల్ నితిన్ ముఖేశ్. ఆ సినిమా షూటింగు దశలో ఉండగానే నీల్ నితిన్ ముఖేశ్ మరో తెలుగు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. నీల్‌ నితిన్‌ కి ఇది రెండో సినిమా. ఈ సినిమాకి తమన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది.