ఈసారి జనసేన పార్టీ అధినేత పవన్ పై కత్తి దూసిన కత్తి మహేశ్

Posted on : 14/03/2018 03:54:00 pm

గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మరోసారి ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై సంచలన ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లతో మరోసారి విరుచుకుపడ్డారు.  జనసేన ఆవిర్భావ దినోత్సవం వేళ పవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ పార్టీ గురించి, పవన్ అభిమానులమీద  ట్వీట్ చేయడం అలవాటుగా మారిన కత్తి తాజాగా జనసేనానినే టార్గెట్ చేశాడు. గుంటూరు జిల్లాలో ఇల్లు క‌ట్టుకొంటున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరులో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సొంతింటి నిర్మాణానికి నిర్మాణానికి హోమం నిర్వహించి భార్య అన్నా లెజినోవాతో కలిసి పూజలు నిర్వహించారు. 

పవన్ కల్యాణ్‌ తన తండ్రి  పని చేసిన స్థలంలో ఇల్లు కట్టుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాహితి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఇంటిని నిర్మిస్తోందని, ఈ ఇంటి స్థలాన్ని అభిమానులే చూపించారన్నారు. రెండు ఎకరాల స్థలంలో ఇంటితో పాటు పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. భూమి పూజ చేసిన రోజే ఆ భూమి కొనుగోలు వెనుక ఏదో కుంభ‌కోణం ఉంద‌ని మ‌హేశ్ ట్వీట్ చేసి పెను దుమారం రేపాడు. తనకు అలాగే భూమి దొరికితే నేను ఓ ఇల్లు కడతానంటూ మహేశ్ చేసిన కామెంట్ పై జ‌న‌సేన వ‌ర్గాలు తీవ్రంగా మండిప‌డ్డాయి.  

ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే అమరావతిలో ఇంటిని నిర్మిస్తున్నట్లు పవన్‌ తెలిపారు. ఒక‌వైపు జ‌న‌సేన ఆవిర్భావ స‌భ భారీగా నిర్వ‌హించేందుకు ప‌వ‌న్ ఏర్పాట్లు చేసుకుంటున్న నేప‌థ్యంలో క‌త్తి మ‌హేశ్ చేసిన విమ‌ర్శ‌లు ఆ పార్టీ కేడ‌ర్‌లో ఆగ్ర‌హాలు తెప్పిస్తున్నాయి. బుధవారం జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవంలో తనను విమర్శించిన వాళ్లందరికీ పవన్ కల్యాణ్ కౌంటర్లు ఇవ్వనున్నారని సమాచారం.