జిమ్ లో ఫుల్ వర్కవుట్స్ తో జూనియర్ ఎన్టీఆర్

Posted on : 15/03/2018 10:56:00 am

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందన్న విషయం తెలిసిందే.  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ త్రివిక్రమ్  సినిమా కోసం స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా న్యూ లుక్ మెయిన్ టెయిన్ చేసే పనిలో  ఉన్నాడు.  ఇందులో భాగంగా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ మరోసారి కసరత్తు చేస్తున్నాడు. అయితే ఈ సారి సిక్స్‌ ప్యాక్‌ కోసం కష్టపడుతుండడం విశేషం. 

కేవలం కొన్ని వారాల్లో ఏకంగా 12 కిలోలు తన వెయిట్ తగ్గించేసుకుని మరీ స్లిమ్ గా తయారయ్యాడు. ఒక్కసారిగా 12 కేజీలు బరువు తగ్గడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడట. త్రివిక్రమ్ మూవీ షూటింగ్ మొదలయ్యే లోపే కనీసం ఐదారు కేజీలు చూస్తున్నాడటని తెలుస్తోంది. గతంలో యమదొంగ సినిమాకి తగ్గాలని దర్శకుడు రాజమౌళి సూచన మేరకు ఈ విధంగానే కసరత్తులు చేసి స్లిమ్ అయ్యాడు. 

ఇపుడు ఎన్టీఆర్ తన ఇంటిలోనే అత్యాధునిక జిమ్ ఏర్పాటు చేసుకుని మరీ వర్కవుట్స్ చేస్తున్నాడు. ట్రైనర్ స్టీవెన్స్‌ సమక్షంలో కసరత్తు చేస్తున్నాడు. త్వరలో సెట్స్‌ పైకి వెళ్లే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌ కొత్తగా కనిపించాలన్న దర్శకుడి సూచనమేరకు ఇలా కష్టపడుతున్నాడు.