ఉగాది పండుగ రోజే ఉగ్రం ఫస్ట్ లుక్ రిలీజ్

Posted on : 15/03/2018 11:15:00 am

నక్షత్ర మీడియా పతాకంపై ఖాసిం సమర్పణలో జె.డి. చక్రవర్తి హీరోగా, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా నక్షత్ర.  రాజశేఖర్ నిర్మించిన యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఉగ్రం. షూటింగ్ పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బిజీగా ఉంది ఈ సినిమా. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుద‌ల చేయనున్నారు. స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత నక్షత్ర రాజశేఖర్ మాట్లాడుతూ జెడి చక్రవర్తి తను నటించిన సినిమాలలో ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించారని, ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 

అతని కెరీర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందన్నారు. యూత్ కి బాగా దగ్గరగా ఉంటుందని, అలానే మాస్ ఇమేజ్ వున్న ద‌ర్శ‌కుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథకు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఈ సినిమాలో నటించారన్నారు. జెడి చక్రవర్తి, అక్షిత, మనోజ్ నందం, అక్షత, బెనర్జీ, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ - జాన్ భూషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - చిన్నా, ఆర్ట్ డైరెక్టర్ - వెంకటారే, మేకప్ - శివ, డిఓపి - అంజి, ఎస్.ముజీర్ మాలిక్.