ఈ రోజు మధ్యాహ్నం కిరాక్ పార్టీ టీమ్ తో లైవ్ లో....

విభిన్న కథ, కథనాలతో సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సిమ్రాన్ పరింజ, సంయుక్తా హెగ్దే హీరోయిన్లుగా నటించిన సినిమా కిరాక్‌పార్టీ. ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కన్నడ సినిమా కిరాక్ పార్టీను రీమేక్ చేసి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రబృందం ప్రస్తుతం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ట్రైలర్ హ్యాపీడేస్ ఫీల్‌ని కలిగిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా రీలీజ్ ముందే అభిమానులకు కిరాక్ పార్టీ టీమ్ మాంచి ఫీస్ట్ ఇవ్వనుంది.
అదేంటో తెలుసా? ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు లైవ్‌లో కిరాక్ పార్టీ టీమ్ తో అభిమానులు కాసేపు కాలక్షేపం చేయవచ్చు. అభిమానులంతా 2గంటలకు రెడీగా ఉంటే కిరాక్ పార్టీ టీమ్‌ని కలుసుకోవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై సుంకర రామబ్రహ్మం ఈ సినిమాని నిర్మిస్తుండగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి అజనీష్ లొకనాథ్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా విజయంపై నిఖిల్ కూల్ గా ఉన్నాడట.