ఈ రోజే రంగస్థలం జూక్ బాక్స్ రిలీజ్

Posted on : 15/03/2018 12:03:00 pm

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స‌మంత , ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా రంగస్థలం. ఈ సినిమా ఈ నెల 30వ తేదిన విడుద‌ల కానుంది. 1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రిలీజైన మూడు పాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులోని ఎంత సక్కగున్నావే పాట సంగీత ప్రియుల్ని విశేషంగా అలరించింది. అందులో సాహిత్యం కట్టిపడేసింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ రంగమ్మా మంగమ్మా పాట తెలుగు శ్రోతల దృష్టిని బాగా అలరించింది. ఫస్ట్‌లుక్ నుంచి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 

ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఐదు పాటలతో కూడిన జూక్ బాక్స్ ఈ రోజు రిలీజ్ చేశారు. రంగస్థలం ఆల్బంలో చివరగా వినిపించే పాట జిగేలురాణి. ఇది ఐటెం సాంగ్ అనే సంగతి పాట ప్రారంభంలోనే అర్ధమవుతుంది. ఈ పాటకు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే స్పెషల్ అట్రాక్షన్. చంద్రబోస్ తన లిరిక్స్‌తో అదరగొట్టాడు. ఐటెం సాంగ్స్ అందించడంలో దేవిశ్రీ ప్రసాద్ తనకు తానే సాటి అని మరోసారి ఇరగదీసే రేంజ్ లో జిగేలు రాణి పాటను కంపోజ్ చేశాడు.