ఈ రోజే కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే జ్యూక్ బాక్స్ రిలీజ్

Posted on : 15/03/2018 12:23:00 pm

నంద‌మూరి హీరో కళ్యాణ్ రామ్, అందాల చందమామ కాజల్ అగర్వాల్ జంటగా ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఎమ్మెల్యే. మంచి లక్షణాలున్న అబ్బాయ్ అన్నది ట్యాగ్ లైన్. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా జ్యూక్ బాక్స్ ను ఈరోజు సాయంత్రం అయిదు గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో పొలిటీషియన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎంఎల్‌ఎ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. 

బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అసోసియేషన్‌లో గతేడాది విడుదలైన నేనే రాజు నేనే మంత్రి సినిమా పెద్ద సక్సెస్‌ సాధించిందన్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.  కాగా కాజల్ అగర్వాల్ తొలి సినిమా లక్ష్మీ కళ్యాణం లో కల్యాణ్‌ రామ్, కాజల్‌ కలిసి జంటగా నటించిన తర్వాత పదకొండేళ్లకు మళ్లీ ఈ ఎంఎల్‌ఎ సినిమా లో కలిసి నటిస్తున్నారు.