త్రిష్ తో లవ్ లేదు....హీరో శింబు

Posted on : 15/03/2018 01:54:00 pm

హీరోగా, సింగర్‌గా, నిర్మాతగా, దర్శకుడిగా ఇలా చాలా పాత్రల్లో మెప్పించిన తమిళ హీరో శింబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ తారల లవ్ అఫైర్స్ ఎప్పుడూ క్రేజ్ కలిగిస్తూనే ఉంటాయి. ఒక హీరోయిన్ మరో హీరోతో లవ్ లో పడినా, కొంతకాలం ఎఫైర్ సాగించి బ్రేకప్ అయినా ఆడియన్స్ లో మాత్రం వారిపట్ల క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది.  కోలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ ఎప్పుడూ ఆసక్తికరమే. ఏ ముద్దుగుమ్మ ఎవరితో, ఎంతకాలం డేటింగ్ చేస్తుందో తెలియదు. ఓ హీరో పటాయించిన పోరిని మరొకరు అదనుచూసి తన్నుకుపోవడం ముందునుంచి ఉన్నదే. కొంతమంది హీరోయిన్లతో  శింబు నడిపిన ప్రేమాయణం గురించి కోలీవుడ్ లో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. 

అలా ఆయన ప్రేమాయణం నడిపిన హీరోయిన్ ల లిస్ట్ లో హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. కెరియర్ మొదట్లో శింబు, త్రిషతో కలిసి రెండు సినిమాల్లో నటించాడు. ఈ ఇద్దరు కలిసి నటించిన విన్నైతాండి వరువాయా అప్పట్లో అక్కడ పెద్ద హిట్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సమయంలోనే వాళ్లిద్దరూ ప్రేమలో పడినట్టుగా జోరుగా ప్రచారం జరిగింది. 

తాజాగా ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి ఇప్పుడు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో శింబు ఇలా స్పందించాడు అప్పట్లో త్రిషతో తను లవ్ లో ఉన్నట్లు జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని శింబు తేల్చి చెప్పాడు. హీరోయిన్ త్రిష తనకు చిన్నప్పటి నుంచీ తెలుసనీ, ఆమెతో ఉన్నదని స్నేహమే తప్ప మరొకటి కాదని స్పష్టం చేశాడు.