రేపే నాగ్ చైతన్య సవ్యసాచి ఫస్ట్ లుక్ రిలీజ్

Posted on : 15/03/2018 02:21:00 pm

కథల మీద, దర్శకుల మీద నమ్మకాన్ని ఉంచి,  నమ్మకంతో సినిమాలు చేస్తూ, తన సినిమాల్లో ఖచ్చితంగా వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ, మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు అక్కినేని హీరో నాగ చైతన్య. ప్రేమమ్ సినిమాతో నాగ చైతన్యకి తిరుగులేని హిట్ ఇచ్చిన డైరెక్టర్ చందు మొండేటి. ఇపుడు ఆయన డైరెక్షన్‌లో సవ్యసాచి సినిమాను చేస్తున్నాడు ఈ యంగ్ హీరో నాగ చైతన్య.  ప్రేక్షకులను కట్టిపడేసేలా సవ్యసాచి సినిమాలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ఉండే విధంగా దర్శకుడు చందు మొండేటి మొదటి నుంచి పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. వీళ్లిద్దరి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలే  హైలైట్ గా సవ్యసాచి తెరకెక్కుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈనెల 16నే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్‌ పంచ్‌ పేరుతో ఈ పోస్టర్‌ రేపు ఉదయం 10:30 లకు రిలీజ్ అవబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణీ సంగీతం సమకూరుస్తున్నారు.