మహిళా కబడ్డీ తొలి సాంగ్ రిలీజ్

Posted on : 15/03/2018 03:09:00 pm

మహిళలు ఎందులో తక్కువ కాదనే కానె్సప్ట్‌తో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో ఆర్.కె.ఫిలింస్ పతాకంపై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా మహిళా కబడ్డీ. రచన స్మిత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. శివాజీ రాజాగారు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఉగాది పండుగపై ఒక ప్రత్యేక పాటను సంగీత దర్శకుడు బోలే షావళి సంగీత సారధ్యంలో రూపొందించారు. ఈ పాటని ఫిలిం ఛాంబర్‌లో మా అధ్యక్షుడు శివాజీరాజా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభదశలో ఆర్.కె.ఫిలింస్ లో నటించానని, ఈ బ్యానర్ అంటే తన సొంత బ్యానర్ లాంటిదని, ఈ బ్యానర్ తో తనకి మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. 

ఉగాది పండుగపై చేసిన పాటని తాను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని, బోలే షావళి అద్భుతంగా రాసి, కంపోజ్ చేశారని, వరం అనే నూతన గాయని ఎంతో బాగా పాడారన్నారు. ఈ పాటతో ఉగాది పండుగ ముందే వచ్చినట్టుగా అనిపిస్తోందన్నారు. ఒక మారుమూల పల్లెటూరులో ఉన్న అమ్మాయి దేశం గర్వించే స్థాయికి కబడ్డీ ఛాంపియన్‌గా ఎలా ఎదిగిందనేది ఈ కథాంశమన్నారు. ఇటీవలే మూడవ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది.