బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకప్పుడు పూర్తి రెగ్యులర్ కమర్" />
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకప్పుడు పూర్తి రెగ్యులర్ కమర్" />

ఈసారి మహిళల కోసం అక్షయ్ కుమార్..!

Posted on : 20/10/2018 06:21:00 pm

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఒకప్పుడు పూర్తి రెగ్యులర్ కమర్షియల్  సినిమాల్లోనే నటించాడు. ఈయన చేసిన కమర్షియల్ సినిమాలు కోట్లు కురిపించాయి. అయినా కూడా విభిన్నమైన చిత్రాల్లో నటించాలనే ఉద్దేశ్యంతో - సమాజంకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ‘టాయిలెట్’ - ‘ప్యాడ్ మన్’ వంటి చిత్రాల్లో నటించాడు. ప్రతి గ్రామంలో - ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు ఎంత అవసరమో టాయిలెట్ చిత్రంలో చూపించిన అక్షయ్ కుమార్ - ప్యాడ్ మన్ చిత్రంలో ఆడవారు వాడే శానిటరీ న్యాప్ కిన్ గురించి చైతన్య పర్చడం జరిగింది. ఇప్పుడు అంతరిక్ష పరిశోదనలో ఆడవారి ఇన్వాల్వ్ మెంట్ పై ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

అక్షయ్ కుమార్ తో ‘ప్యాడ్ మన్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఆర్ బాల్కీ ప్రస్తుతం ఒక స్క్రిప్ట్ ను సిద్దం చేస్తున్నాడు. బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘మంగళ్ యాన్’ అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. మహిళ సాధికారత అంశంను తీసుకుని ఈ చిత్రంను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిత్రం మహిళలు అంతరిక్ష యానం చేసే నేపథ్యంలో ఉంటుందట. మహిళ శాస్త్రవేత్తల బృందం నాయకురాలిగా విద్యాబాలన్ కనిపించబోతుంది.
అక్షయ్ కుమార్ - విద్యాబాలన్ లు గతంలో ‘చంద్రముఖి’ రీమేక్ అయిన భూల్ భూలాలియా లో కలిసి నటించారు. మళ్లీ 11 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో నటించబోతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా దర్శకుడు బాల్కీ పేర్కొన్నారు. ఈ చిత్రంను వచ్చే నెలలో పట్టాలెక్కించబోతున్నారు. ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ పలు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. మరోసారి మహిళల పట్ల సామాజిక బాధ్యతతో - మహిళల కోసం అంటూ ఈ చిత్రంను చేయబోతున్నాడు.