అగ్ర కథానాయకుడు మ" /> అగ్ర కథానాయకుడు మ" />

సితార ఆనందానికి అలియా

Posted on : 20/10/2018 07:28:00 pm

అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు గారాలపట్టి సితారకు బాలీవుడ్‌ నటి అలియా భట్‌ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. మహేశ్‌ ‘మహర్షి’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతోంది. అక్కడికి ఆయన తన కుటుంబంతో కలిసి వెళ్లారు. షూటింగ్‌ విరామ సమయంలో మహేశ్‌ పిల్లలతో కలిసి న్యూయార్క్‌ వీధుల్లో విహరిస్తుండగా తీసిన ఫొటోలను నమ్రత ఇటీవల షేర్‌ చేశారు.

ఇదే సందర్భంగా సితార తన అభిమాన నటి అలియా భట్‌ను కలిశారు. ఆమెతో కలిసి ఫొటోకు పోజిచ్చింది. దీన్ని నమ్రత షేర్‌ చేస్తూ.. ‘సితారకు ఇష్టమైన అమ్మాయి. తన ముఖంలోని చిరునవ్వుకు కారణమైనందుకు ధన్యవాదాలు అలియా’ అని రాశారు.

అలియా ప్రియుడిగా ప్రచారంలో ఉన్న కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్ తండ్రి రిషి కపూర్‌ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అక్కడికి వెళ్తున్నట్లు రిషి ఇటీవల పేర్కొన్నారు. ఆయన్ను కలవడానికి అలియా న్యూయార్క్‌ వెళ్లారట. సితార ఆమెను కలిసినప్పుడు రణ్‌బీర్‌ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం.