అ" /> అ" />

సమంతతో నాగశౌర్య?

Posted on : 21/10/2018 08:55:00 am

అగ్ర కథానాయిక సమంత కొత్త సినిమా గురించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె కోసం దర్శకురాలు నందినిరెడ్డి ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. ఇది కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రంగా తెలుస్తోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.

కాగా ఈ సినిమాలో యువ కథానాయకుడు నాగశౌర్య కీలక పాత్ర పోషించనున్నారని తాజా సమాచారం. ఈ మేరకు నందినిరెడ్డి ఆయన్ని సంప్రదించినట్లు తెలిసింది. పాత్ర నచ్చి ఆయన కూడా ఓకే చెప్పారట. నాగశౌర్య తన కెరీర్‌లో హిట్‌గా నిలిచిన ‘కల్యాణ వైభోగమే’ సినిమా కోసం నందినిరెడ్డితో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. సామ్‌ నటించిన ‘జబర్‌దస్త్‌’కు ఆమే దర్శకత్వం వహించారు. దక్షిణ కొరియాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘మిస్‌ గ్రానీ’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా‌ను చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో సామ్‌ 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించనున్నట్లు చెబుతున్నారు.