ప్రముఖ సినీనటుడు వైజాగ్‌ప్రసాద్‌ (75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ సో" /> ప్రముఖ సినీనటుడు వైజాగ్‌ప్రసాద్‌ (75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ సో" />

ప్రముఖ సినీనటుడు వైజాగ్‌ ప్రసాద్‌ (75) కన్నుమూత

Posted on : 21/10/2018 09:07:00 am

ప్రముఖ సినీనటుడు వైజాగ్‌ప్రసాద్‌ (75) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైజాగ్‌ ప్రసాద్‌ తుది శ్వాస విడిచారు. వైజాగ్‌ ప్రసాద్‌ అనేక సినిమా, టీవీ సీరియల్స్‌లలో నటించారు. పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించారు. నీరాజనం, నువ్వు-నేను, జెమిని, అల్లరిబుల్లోడు, సుందరకాండ, రాణిగారి బంగ్లా, ఇది మా ప్రేమకథ చిత్రాల్లో వైజాగ్‌ప్రసాద్‌ నటించారు. వైజాగ్‌ ప్రసాద్‌ 1983లో బాబాయి అబ్బాయ్‌ సినిమా ద్వారా నటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశారు.