బీజేపీకి చీటీ తెచ్చిన చిక్కు

Posted on : 18/03/2018 12:54:00 pm

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ నేత కిషన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏం నష్టమైస్తుందో తెలియదు గానీ,ఈ విషయంలో మోదీని తెగ వెనుకేసుకొస్తున్నారాయన,  ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకురుతుందని, ఆనాడు రాజకీయ అనుభవం లేకనే చంద్రబాబు మాటలు జనసేన అధ్యక్షుడు పవన్ చెప్పిన మాటలు జనం నమ్మినప్పుడు తన మాటలెందుకు జనం వినరనుకున్నారో ఏమో కిషన్ రెడ్డి, మోదీకి ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండా ఎవరో ఇచ్చిన చీటీని తిరుపతి బహిరంగ సభలో చదివేశారని కిషన్ రెడ్డి నంగనాచి కబుర్లు చెప్పుకురావడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు.కొందరు ఏపీ నేతలు. ఈ విషయంలో రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్,  రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన మోదీ ఇద్దరూ ఒక్కటేనా అనే విమర్శలూ వస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న నేతకు ఎవరో వచ్చి చీటి ఇవ్వటం ఏమిటి? ఆయన వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడి.. హామీ ఇవ్వటం ఏమిటి? నమ్మటానికి కూడా వీల్లేనట్లుగా ఉన్న కిషన్ రెడ్డి మాటలు చూస్తేనే ఆయనేం చెప్పాలనుకుంటున్నారో అర్థమవుతుంది. ఇలాంటి మాటలు ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. మోడీకి దన్నుగా నిలవాలనుకునే ప్రయత్నంలో ఆయన అడ్డంగా మునిగిపోతారన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.