అసంతృప్తితో మొదలైంది - అవిశ్వాసం దగ్గరకొచ్చి ఆగింది

Posted on : 19/03/2018 10:07:00 am

అసంతృప్తితో మొదలై, ధర్నాలకు దారితీసి, కేంద్రం పై అవిశ్వాసం దగ్గర ఆగింది ఏపీ ప్రత్యేక హోదా సమస్య. అయితే సజావుగా సాగాలి సభ్యులు మెజారిటీలో ఎన్డీయేలో ఓడించాలి. ఇదంతా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీ స్పెషల్ స్టేటస్ సమస్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేలా జరిగే ఓ పక్రియ అయితే అమిత్ షా అవిశ్వాసం నిలబడే ప్రసక్తేలేదు, తమకు300 మంది మెజారిటీ సభ్యుల మద్ధతు ఉందంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక లెక్కైతే ఇదేదో కంటి తుడుపు చర్యగానే కనిపిస్తోంది తప్ప ఈ విషంయలో ఏపీలో అధికార ప్రతిపక్షాలు తలోదారిలో ఉన్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు తీరుపై కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చి, అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ముందు వైసీపీ సైతం అవిశ్వా తీర్మానం నోటీసులు ఇచ్చింది. శుక్రవారం టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు చర్చకు రాకుండానే స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ వాయిదాతో ఈ తీర్మానాలు వీగిపోయిన నేపథ్యంలో మరోసారి టీడీపీ, వైసీపీలు వేర్వేరుగా సోమవారం అవిశ్వాసం నోటీసులు ఇచ్చాయి. శుక్రవారం నాడు అవిశ్వాస తీర్మానం నోటీసును చదవి వినిపించిన స్పీకర్ సుమిత్రా మహాజన్, వెల్‌లోకి వచ్చి సభ్యులు నినాదాలు చేయడంతో చర్చకు అవసరమైన 50 మంది ఎంపీల లెక్క తేలలేదని ప్రకటించారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సభ సజావుగా సాగనంత వరకూ అవిశ్వాసం చర్చకు వచ్చే ప్రసక్తే లేకపోవడంతో ఇప్పట్లో అవిశ్వాసానికి అమావస్యరోజులేనన్న వార్తలొస్తున్నాయి.

సోమవారం మరోసారి ఇరు పార్టీలూ నోటీసులు ఇవ్వగా, వీటిని మధ్యాహ్నం సభ ముందుంచే అవకాశాలున్నట్టు సమాచారం. నేడు కూడా సభ సజావుగా సాగకపోతే శుక్రవారం నాటి పరిస్థితులే పునరావృతం అవుతాయని భావిస్తున్నారు. అవిశ్వాసానికి అవసరమైన సభ్యుల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను టీడీపీ, వైసీపీలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, తృణ‌మూల్‌, మజ్లిస్, బీజేడీ, కమ్యూనిస్టులు అవిశ్వాసానికి మద్దతు ప్రకటించాయి. శివసేన మద్దతు తెలిపినా ప్రస్తుతం ఊగిసలాటలో ఉంది. ఇక తెరాస మాత్రం తన వైఖరిని వెల్లడించలేదు. ఎన్డీఏకు సొంతంగా మెజారిటీ ఉన్నందున మోదీ సర్కారుకు అవిశ్వాసంతో పెద్దగా ప్రమాదం ఉండదు, కానీ నిన్నమొన్నటి దాకా మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం కాస్తంత ఇబ్బందికరమే. అవిశ్వాసంపై చర్చ జరిగితే మోదీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపాలని విపక్షాలు కాచుకు కూర్చున్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చ జరిగేలా పట్టు పట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. వాయిదాలతో కాకుండా పక్కా వ్యూహంతో ఇరుకున పెట్టాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే 50 మంది ఎంపీలతో సంతకాలు చేయించింది. గందరగోళం సృష్టించి చేయించి సభను వాయిదా వేయాలని చూస్తే పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు ఉధృతం చేయాలని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎట్టి పరిస్థితిల్లోనూ వెనక్కి తగ్గొద్దని నిర్ణయించింది. ఇప్పటికే ఎంపీలకు విప్‌ జారీ చేసిన టీడీపీ, పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ అందదరూ హాజరుకావాలని ఆదేశించింది. తాము కూడా అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి చర్చకైనా వెనుకాడబోమని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ స్పష్టం చేశారు.