చంద్రబాబు నోరు అదుపుతప్పింది - ఇప్పుడేమో అది కాస్తా వైరల్ అయ్యింది

Posted on : 19/03/2018 11:38:00 am


ఎక్కడైనా తండ్రి వారసత్వం కొడుక్కి రావడం సర్వసాధారణం, కానీ తేదేపా అధినేత చంద్రబాబు విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. కొడుకు వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేంటి కొడుకు వారసత్వం కొడుక్కి రావడమేంటని మరీ అంతగా ఆలోచించకండి ఆ వారసత్వం ఏంటో పక్షం మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ ఏ బహిరంగ సభల్లో మంత్రి లోకేష్ మాట్లాడినా తేదేపా ప్రతికూల మీడియా అతని మాటలను ఓ కంట కనిబెడుతూనే ఉంటుంది. ఎందుకంటే రోజులకు రోజులు ఆ ఆ క్లిప్పింగులను పదేపదే ప్రసారం చేస్తూ తమ టీ ఆర్పీని పెంచుకునేందుకు. సోషల్ మీడియా కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బీకాంలో ఫిజిక్స్ కాన్సెప్ట్ ఎంత వైరల్ అయ్యిందో నెటిజన్లకు తెలిసిన విషయమే.

ప్రధానంగా మంత్రి లోకేష్ మీడియా ముందు మాట్లాడేటప్పుడు చంద్రబాబుకే కాదు మొత్తం తేదేపా శ్రేణులందరికీ ఒకింత భయమే ఎందుకంటే పొరపాటున తొందరపాటులో తేదేపాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడేస్తారోనని. పోనీ తనంటే కుర్రాడు ఏదో తొందరపాటో, తెలియని తనమో, అనుభవలేమో అనుకోవచ్చు. ఏదో ఒకటి మాట్లాడేసి తరువాత నాలుక కరుచుకోవడం ఏపీ ఐటీ మంత్రికి అలవాటైపోయింది. మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటోన్న చంద్రబాబుకి ఏమైంది? అంత తొందరపాటు,తత్తర పాటు ఎందుకని లోకం కోడై కూస్తోంది.

సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. ఇంతకూ అసలు విషయం ఏంటంటే? చంద్రబాబు ఓ విషయంలో నోరుజారారు తరువాత నాలుక కరుచుకున్నారు లెండి అది వేరే విషయం అదిప్పుడు వైరల్ గా మారింది.లాస్ట్ బడ్జెట్ చూసిన తర్వాత భరించలేకపోయా. ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేశంలోని నాయకులంతా నా తర్వాతే ముఖ్యమంత్రులు అయ్యారు. నేను సీనియర్ గా ఉండి.. ఎక్కడా భేషజం లేకుండా ఎన్నిసార్లు వెళ్లి.. నా రాష్ట్రానికి అన్యాయం చేయండి.. గొంతెమ్మ కోర్కెలు కావు. ఆ రోజు పార్లమెంటు బిల్లులో పొందుపర్చిన అంశాలే. ఇంకోపక్క.. ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో హామీలు ఇచ్చారో వాటినే కోరాం అని వ్యాఖ్యానించారు. ఇందులో.. "నా రాష్ట్రానికి అన్యాయం చేయండి"అనే మాటను ఒకటికి రెండుసార్లు హైలెట్ చేస్తున్నారు. నా రాష్ట్రానికి అన్యాయం చేయండన్న మాట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.