ఆర్బీఐ ఉద్యోగులకంటే తిరుపతి దేవస్థానం ఉద్యోగులే నయం

Posted on : 19/03/2018 01:15:00 pm


దేశ ప్రజలకు మోదీ కొట్టిన అతి పెద్ద దెబ్బ పెద్దనోట్ల రద్దు, నల్లధనం నిర్మూలన, ఉగ్రవాదంపై ఉక్కుపాదం అనే అంశాలతో పెద్దనోట్ల రద్దు చేపట్టిన మోదీ ఇప్పటి వరకూ ఎంత నల్లధనాన్ని వెనక్కు తెప్పించారో? ఇప్పటికీ ఆ డబ్బును లెక్కించలేదంటున్న ఆర్బీఐ అధికారులపై కేంద్ర మాజీ మం త్రి పీ చిదంబరం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నేను ఆర్బీఐ అధికారులకు ఓ సలహా ఇవ్వదల్చుకున్నా. డబ్బును ఎలా లెక్కించాలో తిరుపతి హుండీ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి నేర్చుకోండి. వారు మీ కంటే వేగంగా డబ్బును లెక్కిస్తారు అని సైటైర్ వేశారు. గత అక్టోబర్ లో ఓ ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్బీఐ జవాబిస్తూ రద్దయిన నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొనడంపై ఆయన స్పందించారు. పెద్ద నోట్లను రద్దు చేసి ఇన్నిరోజులవుతున్నా ఇంకా లెక్కింపు పూర్తి చేయకపోవడంపై చిదంబరం ఆర్బీఐకి చురకలు అంటించారు.

ఇదిలాఉంటే? పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత రూ.500 - 1000 నోట్లను చీలికలుగా చేసి - ఇటుకల్లా మార్చుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఓ పీటీఐ ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్కు ఆర్బీఐ ఈ మేరకు వెల్లడించింది. ఈ నోట్ల పరిశీలన - ప్రామాణికత - లెక్కింపు తదితర సేవల కోసం దేశవ్యాప్తంగా వివిధ ఆర్బీఐ కార్యాలయాల్లో 59 కరెన్సీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) మెషీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది ఈ నోట్లను రీసైక్లింగ్ చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెషీన్ల ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ,ముద్దలు చేసి ఇటుకల్లా మార్చుతున్నట్లు వివరించింది. రద్దు సమయంలో ఉన్న కరెన్సీలో 99 శాతం ఈ పెద్ద నోట్లే ఉండగా  వీటి విలువ రూ.15.44 లక్షల కోట్లుగా ఉందని - నిరుడు జూన్ 30 నాటికి డిపాజిట్ల రూపంలో రూ.15.28 లక్షల కోట్లు వచ్చాయంది.