పంతాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టని అధికార, ప్రతిపక్షాలు

Posted on : 19/03/2018 02:43:00 pm

ఇదేం గొడవరా నాయనా? కర్ర విరగాకూడదట, పాము చావా కూడదట అవిశ్వాసం పై వెనక్కు తగ్గేది లేదంటూనే కలిసి పోరాటం చేయమంటున్నాయి ఏపీ అధికార ప్రతిపక్షాలు. దీని బట్టి రాజకీయ ప్రయోజనాలే తప్ప ఈ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాలు ఏ మాత్రం ముఖ్యం కాదన్న విషయం ఇట్టే అర్ధమైపోతోంది. పేరుకే అవిశ్వాస తీర్మానం, నిజానికి అది నెయవేరాలంటే ఏం చెయ్యాలో? ఏం కావాలో ఆ రెండు పార్టీలకు స్పష్టంగా తెలుసు, అయినప్పటికీ వాటి పంతాలే ముఖ్యం కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాదని వాటి వైఖరితో స్పష్టమైపోయిందెప్పుడో? అవిశ్వాసంపై వెనక్కు తగ్గం.. టీడీపీ, వైసీపీ పంతం అవిశ్వాస తీర్మానంపై వెనక్కు తగ్గేది లేదంటున్నారు టీడీపీ, వైసీపీ ఎంపీలు. అవిశ్వాసంపై చర్చ చేపట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటున్నారు.

 అప్పటి వరకు నోటీసులు ఇస్తూనే ఉంటామంటున్నారు. కేంద్రం దిగి వచ్చే వరకు పోరాడతామని,  రేపు కూడా మళ్లీ నోటీసులు ఇస్తామంటున్నారు. అలాగే స్పీకర్ ఇచ్చే విందుకు కూడా ఎంపీలు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. నేడు స్పీకర్ ఎంపీలందరికి విందు ఇస్తున్నారు. అవిశ్వాసం విషయంలో ఆగ్రహం ఉన్న ఎంపీలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరోవైపు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవంతో ,ఏపీ ఎంపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీల సహకారం కోరే ఆలోచనలో ఉన్నారు. సభకు సహకరించి , అవిశ్వాసం చర్చకు వచ్చేందుకు సహకరించాలని విజ్ఞ‌ప్తి చేయాలని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే అవిశ్వాసం చర్చకు వచ్చే అవకాశం ఉంది.