రిలీజ్ కు రెడీ అయిన బాహుబలి 2

Posted on : 21/03/2018 11:53:00 am

ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన సినిమాగా నిలిచింది. 2017 ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ది కన్‌క్లూజన్ రిలీజై చాలా కాలమైనా ఇంకా సందడి కొనసాగిస్తూనే ఉంది. బాహుబలి సినిమా దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. దంగల్ సినిమా చైనా లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాహుబలి ది కంక్లూజన్ కూడా  చైనాలో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  గతంలో బాహుబలి ది బిగినింగ్ సినిమా చైనాలో విడుదలై అనూహ్యంగా ప్రేక్షకాదరణ పొందింది. ఎమోషన్ ని ఎక్కువగా ఇష్టపడే చైనీయులకు ఈ సినిమా విశేషంగా ఆకర్షించింది. 

దీంతో గత కొంత కాలంగా ఆర్కా మీడియా బాహుబలి ది కన్‌ క్లూజన్ ను విడుదల చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. సెన్సార్ పనుల ఆలస్యం వలన అప్పుడు రిలీజ్ కాలేదు. ఫైనల్ గా ఇప్పుడు సెన్సార్ పనులు పూర్తవ్వడంతో చైనాలో బాహుబలి - ది కంక్లూజన్ చైనాలో సైతం విజయ ఢంకా మ్రోగించేందుకు సిద్ధం అయ్యింది. ఇ-స్టార్స్ మీడియా ఈ సినిమాను చైనాలో రిలీజ్ చేస్తున్నారు.