ఫ్యాన్స్ కోసం రకుల్ మొబైల్ యాప్
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో కెరీర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతున్నది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్. మోడలింగ్ నుంచి చిత్రసీమలోకి ప్రవేశించిన ఈ అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తక్కువ వ్యవధిలోనే దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోంది. రకుల్ తనకున్న విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని తన అభిమానులకు ఎపుడూ దగ్గరగా ఉండాలని, వారితో తరచూ సంప్రదింపులు చేయాలనే ఉద్దేశ్యంతో తన పేరుతో ఓ యాప్‌ను రూపొందించుకుని విడుదల చేసింది. ప్రముఖ న్యూయార్క్ సంస్థతో ఈ యాప్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎస్కేపెక్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ షామిక్ తాలూక్దార్తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ పేరుతో సొంత యాప్‌ను రకుల్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం తేలికేనని, అభిమానులు తమ సూచనలు, సలహాలను తనకు పంపవచ్చని తెలిపింది.