బన్నీ సినిమా కోలీవుడ్ లో కూడా అదే రోజు రిలీజ్

Posted on : 21/03/2018 01:36:00 pm

ఏది ఏమైనా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. కొత్తగా అభిమానులను సంపాదించుకోవడంలోగానీ, తన మార్కెట్ ను ఎప్పటికపుడు విస్తృతం చేసుకోవడంలోగానీ బన్నీ అందరికన్నా ఒక అడుగు ముందుంటాడు. ఆల్రెడీ మళయాళం అభిమానులలో అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. తెలుగుతో పాటు మలయాళంలోను అవే రోజున అల్లు అర్జున్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇపుడు అతని దృష్టి కోలీవుడ్ పై పడింది. అల్లు అర్జున్ తాజాగా చేస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమాను టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా అదే రోజున రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. సాధారణంగా తెలుగులో రిలీజైన కొంతకాలానికిగాని తమిళంలో డబ్ అయి రిలీజయ్యేవి కావు.  

డైరెక్ట్ గా ఒకే రోజు రిలీజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ బాగుంటుందని అల్లు అర్జున్ భావించడంతో తమిళ్ లో ఎన్ పేరు  సూర్య అంటూ నా పేరు సూర్యను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమాతో కోలీవుడ్ లో స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తున్నాడు. అల్లు అర్జున్.