యుట్యూబ్ లో రికార్డులను క్రియేట్ చేస్తున్న బన్నీ సినిమా

Posted on : 21/03/2018 02:27:00 pm

అల్లు అర్జున్ సినిమాలు మన టాలీవుడ్ లో కంటే కంటే హింది, మలయాళంలో రికార్డులు సృష్టించడం తెలిసిన విషయమే. మాస్‌ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కెరీర్‌లో బిగెస్ట్‌ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన సరైనోడు హింది వెర్షన్ తాజాగా మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్ యూ ట్యూబ్‌లో రికార్డ్‌లు తిరగరాస్తోంది. ఇప్పటి దాకా యు ట్యూబ్ లో ఏ భారతీయ సినిమాకు దక్కని ఘనతను తన పేరిట నమోదు చేసుకుంది. ఈసినిమాను ఆన్‌లైన్‌లో ఈ సినిమాను ఇప్పటిదాకా సుమారు నూట నలభై అయిదున్నర మిలియన్లకు పైగా ప్రేక్షకులు వీక్షించారని సమాచారం. 

సరైనోడు సినిమా 5 లక్షల లైక్స్ దక్కించుకున్నమొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ను గోల్డ్‌ మైన్స్‌ టెలిఫిలింస్‌ సంస్థ తమ యూట్యూబ్‌ చానల్‌ లో పోస్ట్ చేశారు. ఈ సినిమాతో మొదలైన జోరు ఆ తరువాత వచ్చిన డీజె కూడా నూట ఇరవై మిలియన్ వ్యూస్ తో ఈ సరైనోడు సినిమా రికార్డును బ్రేక్ చేసే దిశగా దూసుకువెళ్తోంది.