కాలా రీలీజ్ డేట్ మారనుందా?

Posted on : 22/03/2018 12:23:00 pm

తమిళనాడు తలైవా, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కాలా. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్‌పతాకంతో కలిసి వండర్‌బార్ ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాని ఏప్రిల్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ముస్తాబు అవుతోందన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాని మే నెలకు వాయిదా వేశారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. స్ట్రైక్ మూలంగా ప్రస్తుతం తమిళనాడులోని మల్టీఫెక్స్‌లు, థియేటర్లు నిరవధికంగా మూతపడ్డాయి. తమిళ నిర్మాతలు చేస్తున్న నిరవధిక స్ట్రైక్ ఒక పక్క, థియేటర్ యజమానుల స్ట్రైక్ మరోక పక్క దీని వల్ల విడుదలకు నోచుకోని కొన్ని సినిమాలకోసం కాలా విడుదలను పోస్టుపోన్ చేయమని అడిగారని, వాళ్ళ మాటను అంగీకరించి కాలా సినిమాను వాయిదా వేశారనే రూమర్ ఇపుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై లైకా ప్రొడక్షన్స్‌ వెంటనే స్పందించి కాలా విడుదల తేదీ గురించి ఎవరికీ ఎలాంటివి చెప్పలేదని, రిలీజ్‌ డేట్ గురించి బయట వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.