ఊర్మిళ సెకండ్ ఇన్సింగ్స్ షురూ

Posted on : 22/03/2018 01:03:00 pm

బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి తన అందచందాలతో, హావభావాలతో ఆకట్టుకున్న బాలీవుడ్ బామ ఊర్మిళా మతోండ్కర్ మళ్లీ సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టబోతోంది. 1992 లో విడుదలైన చమత్కార్ ఆమె నటించిన మొదటి  బాలీవుడ్ సినిమా. ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ హీరోగా నటించాడు. 1995లో ఆమె నటించిన రంగీలా సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. దేశమంతటా అభిమానులును సంపాదించుకొంది ముంబై భామ ఊర్మిళా మండోద్కర్. ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. తర్వాత ఊర్మిళ 2008 వరకు సినిమాలలో నటించింది. మొహసిన్ అక్తర్ మీర్ అనే కశ్మీర్ వ్యాపారిని  పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్తి పలికింది. 

మళ్లీ సుమారు పదేళ్ల తర్వాత రంగీలా బ్యూటీ ఇర్ఫాన్‌ ఖాన్‌ నటించిన బ్లాక్‌మెయిల్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో ఊర్మిళ నర్తిస్తోంది. బెవాఫా బ్యూటీ అనే పాటతో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.  త్వరలో ఈ పాటకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయనున్నారు. ఈ పాటని రేపు ఆవిష్కరించబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఊర్మిళ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అభినయ్‌ డియో దర్శకత్వం వహించారు. బ్లాక్‌ మెయిల్‌ సినిమా ఏప్రిల్‌ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.