చిట్టిబాబుని ఇమిటేట్ చేస్తోన్న అల్లు అర్జున్ కొడుకు

Posted on : 22/03/2018 01:33:00 pm

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా రంగస్థలం. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. రంగస్థలం సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో కనిపించనున్నాడు. గళ్ల లుంగీతో, గళ్ల చొక్కా, టవల్ తో ఉంటాడు. ఈ గెటప్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఇదే గెటప్ తో గల్ల లుంగీ, గల్ల చొక్క వేసుకొని దానిపై పాతకాలం నాటి టవల్ వేసుకొని మామను ఇమిటేట్ చేస్తున్నఅల్లు అయాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉండే అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్ కు ఈ గెటప్ వేసి ఫొటో తీసి ట్విటర్ లో పోస్ట్ చేశాడు. 

ఈ ఫొటో అచ్చు రంగస్థలంలో చిట్టిబాబు మాదిరిగా ఉండడంతో మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఈ లుక్ లో వారెవ్వా అనిపిస్తున్నాడు అల్లు వారబ్బాయి.  భారీ తారాగణం, బడ్జెట్‌తో రూపొందిన రంగస్థలం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.