విక్రమ్ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందట

Posted on : 22/03/2018 03:36:00 pm

కెన‌డియ‌న్ బ్యూటీ అమీ జాక్స‌న్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూడచక్కని రూపంతో, మత్తెక్కించే చూపులతో యువతను కట్టిపడేసే సౌందర్యంతో మోడల్ గా రాణిస్తున్న సమయంలో ఈ బ్రిటిష్ సుందరి తమిళంలో వచ్చిన మదరాసు పట్టణం సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అక్క‌డి నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌కు వెళ్లిన ఎమీజాక్సన్‌ తమిళంలోనే ఎక్కువ సినిమాలను చేసింది.  భారీ సినిమాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రెండు సార్లు నటించే ఛాన్స్ కొట్టేసిన అతి తక్కువ మంది నటీమణుల్లో ఎమీ ఒక్కరు కావడం విశేషం. ఐ సినిమాలో విక్రమ్‌ సరసన నటించి అందాల ఆరబోత తరువాత ఎమీ ప్రస్తుతం రజనీకాంత్‌తో జత కట్టిన 2.ఓ సినిమా రిలీజ్ కు  సిద్ధమవుతోంది. కారణం ఏమిటో తెలియదు గాని ఇక ఇండియ‌న్ సినిమాల‌కి గుడ్ బై చెప్పేసి ఆఫ్రిక‌న్ దేశంలోని మొరాకోలో సెటిల్ కావాల‌ని డిసైడ్ అయింద‌ట‌. అమీజాక్సన్ అందాలకు భారీగా అభిమానులు ఉన్నారు. మ‌రి ఈ వార్త‌ క‌నుక నిజ‌మైతే అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతారు.