ప్రభాస్ తో నటిస్తానంటున్న రకుల్

Posted on : 22/03/2018 04:07:00 pm

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారింది. రకుల్ అందానికీ, అభినయానికి అదృష్టం తోడవడంతో వరుస విజయాలు ఆమె సొంతమయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోను నటించిన ఈ ఢిల్లీ భామ తెలుగులోనే కాకుండా ఇప్పుడు తమిళ్, మలయాళం, హిందీ లో కూడా నటిస్తూ కెరియర్ టాప్ పొజిషన్లో వుంది రకుల్ ప్రీత్ సింగ్.  తాజాగా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తో నటించాలని ఉందని, ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.  కానీ ఈ భామ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలో హీరోయిన్ కూడా సెలెక్ట్ అయిపోయిందట.