ప్ర‌దీప్ కు రెండు రోజులే గ‌డువు : ట‌్రాఫిక్ టీజీపీ

Posted on : 05/01/2018 02:09:00 pm

మద్యం తాగి కారు న‌డుపుతూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన ప్ర‌ముఖ యాంక‌ర్ ప్ర‌దీప్ ఎవ్వ‌రికీ క‌న‌ప‌డ‌కుండా ఉంటోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌దీప్‌ కౌన్సెలింగ్‌కు హాజ‌రుకావ‌డానికి ఐదు రోజుల స‌మ‌యం ఇచ్చామ‌ని, మ‌రో రెండు రోజులు ఎదురు చూస్తామ‌ని ట్రాఫిక్ అద‌న‌పు డీసీపీ అమ‌ర్‌కాంత్‌రెడ్డి ఈ రోజు మీడియాకు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన వారంద‌రికీ కౌన్సెలింగ్ ఇస్తామ‌ని, ప్ర‌దీప్ రేపు లేక సోమ‌వారం వ‌స్తార‌ని అనుకుంటున్నామ‌ని అన్నారు. కౌన్సెలింగ్‌కు పెళ్లికాని వారు త‌ల్లిదండ్రుల‌తో, పెళ్ల‌యిన వారు భార్య‌తో కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పారు. గ‌డువులోగా రాక‌పోతే ఛార్జిషీట్ న‌మోదు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.