ఆధార్ పై ఎడ్వ‌ర్డ్ స్నోడెన్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Posted on : 05/01/2018 04:01:00 pm

మాజీ ఎన్ఎస్ఏ ఏజెంట్‌, విజిల్ బ్లోయ‌ర్ ఎడ్వ‌ర్డ్ స్నోడెన్. భార‌తదేశం నిర్వ‌హిస్తున్న ఆధార్ డేటా గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వాలు సుర‌క్షితంగా
ఉంచుతామ‌ని సేక‌రించిన ప్ర‌జ‌ల డేటాను సుల‌భంగా హ్యాక్ చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా డేటా చోరీకి గురికావ‌డం స‌ర్వ‌సాధార‌ణ విష‌య‌మ‌ని ఆయన పేర్కొన్నారు.

ఇటీవ‌ల ఆధార్ డేటా మొత్తం హ్యాక్‌కి గురైంద‌ని, రూ. 500లు చెల్లిస్తే అన్ని ర‌కాల వివ‌రాలు తెలుసుకునే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అలాంటి ఓ క‌థ‌నానికి స్పంద‌నగా ఆయ‌న ఈ ట్వీట్ చేశాడు. అయితే ఆధార్ డేటా చాలా సుర‌క్షితంగా ఉంద‌ని, వీలైనంత మేర‌కు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌కు ఆధార్ అనుసంధానం చేసుకోవ‌డం వ‌ల్ల మంచి జ‌రుగుతుంద‌ని, ఎవ‌రూ హ్యాక్ చేయ‌ని క‌ట్టుదిట్టంగా ఆధార్ స‌ర్వ‌ర్ రూపొందించామ‌ని ఒక ప‌క్క యూఐడీఏఐ, మ‌రో ప‌క్క మోదీ ప్ర‌భుత్వం ప్ర‌చారం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.