తమిళ్ తలైవా కన్నా ఒక మెట్టు ముందున్న కమల్

Posted on : 09/04/2018 10:01:00 pm

తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అగ్రనటులు రజనీ కాంత్, కమల హాసన్ లకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య బాగా ఉంది. తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి  రజనీ, కమల్ హాసన్ రెండు కళ్లుగా అభివర్ణిస్తారు. సూపర్ స్టార్ రజనీ తర్వాతే కమల్ హాసన్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా సినిమాల వరకు. సిల్వర్ స్క్రీన్ మీద రజనీని బీట్ చేసే వారు లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన్ను చిరకాల మిత్రుడే బీట్ చేయడం విశేషం. కాగా సోషల్ మీడియాలో మాత్రం కమల్ హాసన్ తో పోలిస్తే రజనీ కాంత్ కాస్తంత వెనకబడ్డారు. రజనీతో పోలిస్తే కమల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో కమల్ ఖాతాకు 46.95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 

రజనీ ట్విట్టర్ ఖాతాకు 46.15 లక్షల మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారు. రజనీతో పోలిస్తే కమల్ ఎప్పటికప్పుడు ట్వీట్లతో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచుగా పోస్టులు పెడుతూ వస్తున్నారు. అప్పుడపుడు మాత్రమే పోస్టులు చేయడం వల్లన రజనీకాంత్ వెనుకబడ్డారు.