రామ్ గోపాల్ వర్మకు వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు

Posted on : 19/04/2018 11:32:00 am

క్యాస్టింగ్ కౌచ్‌పై సినీ నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లాగమని చెప్పింది తానేనని సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ అంగీకరించిన నేపథ్యంలో విషయంలోకి పవన్‌ను లాగినందుకు పవన్‌కు, అతడి అభిమానులకు ఆర్జీవీ క్షమాపణలు చెపుతూ ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు కూడా. తాను ఎందుకు చేశాడో వివరంగా చెప్పాడు. అయినా కూడా వర్మకు మెగా కాంపౌండ్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. నిర్మాత బన్నీవాసు తీవ్రంగా హెచ్చరించాడు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూల్ ఉండాలని కోరుతుంటామని, ఇపుడు జరిగిన విషయం తెలుసుకున్న తరువాత ఇక ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయమని, తమ సత్తా ఏంటో చూపిస్తామని, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అన్నాడు. 

మెగా ఫ్యాన్స్ మద్ధతుదారులంతా ఈ రోజు  సమావేశమవుతున్నామని, ఈ సాయంత్రం తమ నిర్ణయం వెల్లడిస్తామని తెలిపాడు.