సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు జేసి పవన్ రెడ్డి మద్దతు

Posted on : 20/04/2018 02:50:00 pm

ముందుగా మన అధినేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఒలింపిక్ ప్రధాన కార్యదర్శి జేసి పవన్ రెడ్డి తరపున, జేసి కుటుంబీకుల తరపున, ప్రతి అభిమాని తరపున ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా జేసి పవన్ రెడ్డి, టీడీపీ నేత మాజి రాజ్యసభ సభ్యుడు సైఫుల్లా కుమారుడు జకీవుల్లా ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ దీక్షకు, ఆయన జన్మదినాన ఆయనకు ఇంతమంది మహిళల ఆశీర్వాదం లభించాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.