జగన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేసిన హైకోర్టు

Posted on : 22/04/2018 12:21:00 pm

వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబులపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ నేత వెంకటస్వామి ఫిర్యాదుతో కేసు నమోదైంది. 2011లో హైదరాబాద్ లోని గాంధీనగర్ పీఎస్ లో జగన్, అంబటి రాంబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇందిరాపార్క్ వద్ద ఆమరణ దీక్ష చేస్తున్న తనపై కొందరు నేతలు దాడి చేసి, కులం పేరుతో దూషించారని, తాను దీక్ష చేస్తున్న సమయంలోనే జగన్ దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారని, వారి దీక్ష కోసం తన టెంట్ ను తొలగించారని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో ఎన్.వెంకటస్వామి చేసిన ఫిర్యాదులో వెల్లడించారు. కాగా, కేసు విచారణలో టెంట్ ను తొలగించడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి, అంబటి రాంబాబులు కాదని తేలింది. దీంతో కేసును హైకోర్టు కొట్టేసింది.