పైశాచికత్వమా?! సంప్రదాయమా ?!?

Posted on : 05/01/2018 11:44:00 pm

కోళ్ల కాళ్ళకి కత్తులు కట్టి కోట్లు కుమ్మరించి జూదమాట్టం సంప్రదాయమా ?!
కోళ్లు రక్కుకోవటం, పొడుచుకోవటం పండుగా నీకు ?!?!
హార్మోన్లు ఇంజెక్ట్ చెయ్యటం కూడా సంప్రదాయమేనా ?!
పూర్వీకులు తప్పు చేస్తే అది తప్పే...దాన్ని నువ్వు ఆచారం అని చెప్పి అనుసరించనక్కర్లా...!!!

కోడిని కోసి తింటే తప్పు కాదు కొట్లాడమంటే తప్పా అని తల తిక్క మాటలెందుకు?!?!
మాంసాహారం ఆహారపు అలవాటు..చిత్ర హింసలు పెట్టి వినోదించడం అలవాటా?!?!
మనిషి ఉన్నతిని చాటాలి సంప్రదాయమంటే.., క్రూరత్వాన్ని కాదు..!!

- రఘునాథ్ బాబు