ఇరాక్ సంచలన ప్రకటన... షాక్ లో అగ్రరాజ్యం అమెరికా

Posted on : 23/04/2018 10:33:00 am

యావత్ ప్రపంచాన్నిఅణు పరీక్షలతో  తీవ్ర భయకంపితులను చేసిన ఉత్తర కొరియా ఒక ప్రక్క అణుపరీక్షలు నిలిపేస్తున్నామన్న ప్రకటనతో ప్రపంచం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరో పక్క ఇరాన్‌ చేసిన సంచలన ప్రకటన అమెరికాను షాక్ కు గురిచేసింది. అణు ఒప్పందం నుంచి తప్పుకుంటే తాము అణు పరీక్షలను మొదలుపెడతామని అమెరికాకు షాకిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావిద్ షరీఫ్ న్యూయార్క్ లో ప్రకటించారు. అణుబాంబులు తయారు చేయాలని తాము కోరుకోవడం లేదని, కాగా ఇరాన్‌, అగ్ర దేశాల (చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా, జర్మనీ) మధ్య 2015లో జరిగిన అణు ఒప్పందాన్ని పాటించటంలో అమెరికా విఫలం అయ్యిందన్నారు. 

ఒప్పందం ప్రకారం మేం అణు పరీక్షలకు దూరంగా ఉన్నామని కానీ, ఇప్పుడు అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తోంది గనుక ఆ పని చేస్తే తాము కూడా అణు పరీక్షలు నిర్వహించటం మొదలుపెడతామని హెచ్చరించింది. కాగా అమెరికా మాత్రం అన్ని ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఇరాన్‌ ప్రధాన ఆరోపణ.  ఇరాన్‌ చేసిన సంచలన ప్రకటనతో అమెరికా దిక్కుతోచని స్థితిలో పడింది. 2015 అణు ఒప్పందానికి కట్టుబడి ఉండే విషయమై అమెరికా యూరోపియన్‌ దేశాలకు మే 12 వరకు గడువు ఇచ్చింది.