సూప‌ర్ స్టార్ కే నా మ‌ద్ద‌తు : క‌మ‌ల్ హాస‌న్

Posted on : 06/01/2018 12:16:00 pm

రజనీకాంత్ రాజకీయ ఆరంగేట్రంపై విలక్షణ నటుడు కమలహాసన్ మరోసారి స్పందించారు. రాజకీయాల్లోకి ఆయన రావడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మలేషియాలో జరుగుతున్న సడిగర్ సంఘం స్టార్ నైట్ కార్యక్రమానికి వెళ్తున్న ఆయన చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. రజనీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తాను ఇప్పటికే చెప్పానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో డబ్బు ప్రభావంతోనే దినకర్ గెలిచారన్న తన విమర్శకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ విషయంలో ఆయన నుంచి ఎలాంటి కేసులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని తెలిపారు. దినకరన్ విజయం ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ అంటూ కమల్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ దినకరన్ వర్గీయులు... కమల్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.