కీరవాణి పాటకు కింగ్ నాగార్జున ఫిదా..

Posted on : 12/11/2018 07:49:00 pm


సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.ఓ'. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. 

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్, ఆడియో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పోయి. 2.0 చిత్రంలోని 'బుల్లిగువ్వా..' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్‌గా ఉందంటూ ప్రశంసించారు.

సుమారు 600 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూపొందించింది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకొన్నారు. ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా విడుదల చేస్తున్నారు. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.