సంక్రాంతి రేసులో నాలుగు చిత్రాలు ...

Posted on : 12/11/2018 08:01:00 pm


వచ్చే యేడాది సంక్రాంతి రేసులో నాలుగు చిత్రాలు బరిలో నిలువనున్నాయి. ఈ చిత్రాలన్నీ అగ్రహీరోలు నటిస్తున్న చిత్రాలు కావడం గమనార్హం. వీటిలో "ఎన్టీఆర్ బయోపిక్", 'వినయ విధేయ రామ', "ఫన్ అండ్ ఫస్ట్రేషన్ (ఎఫ్2)", 'మిస్టర్ మజ్ను'. ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నారు.

'ఎన్టీఆర్ బయోపిక్' జనవరి 9న రిలీజ్ కాబోతుంటే, 'వినయ విధేయ రామ' జనవరి 11న వస్తున్నది. సంక్రాంతి పండుగ రోజున 'ఎఫ్2ఎఫ్' రాబోతున్నది. వీటితో పాటు అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నది.

జనవరిలో సినిమా క్యాష్ చేసుకోవాలి అంటే సంక్రాంతికి రావాలి. మిగతా రోజుల్లో ఎప్పుడు వచ్చినా పెద్దగా కలెక్షన్లను వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. లేదంటే రిప్లబ్లిక్ డే రోజున రిలీజ్ చేయాలి. సో, ఏదైతేనేం వచ్చే యేడాది జనవరి నెలలో నాలుగు సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా హిట్ అవుతుందో చూడాలి.