బంగాళాఖాతంలో ‘గజ’ తుపాన్‌ ఉద్ధృత రూపం దాల్చి తీరం వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చ" /> బంగాళాఖాతంలో ‘గజ’ తుపాన్‌ ఉద్ధృత రూపం దాల్చి తీరం వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చ" />

‘గజ’ తుపాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి

Posted on : 12/11/2018 08:14:00 pm

బంగాళాఖాతంలో ‘గజ’ తుపాన్‌ ఉద్ధృత రూపం దాల్చి తీరం వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పరిసరాలపై తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని తీరప్రాంత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాన్‌ కదలికలను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అంచనావేసి అప్రమత్తం కాగలిగిన విషయాన్ని గుర్తు చేశారు. రియల్‌ టైం గవర్నెన్స్‌ను ఉపయోగించుకుని వాస్తవాలను అంచనా వేయాలని ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం మేరకే చర్యలు చేపట్టాలని సూచించారు.