బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్

Posted on : 12/11/2018 08:45:00 pm


తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితర నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం వార్నింగ్ ఇచ్చారు. మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన కూడా మండిపడ్డారు.

మన జనసేనకు అండగా ఉండే యువతను ఎమ్మెల్యే బాలకృష్ణ సంకర నా కొడుకులు అని, దెందులూరు రౌడీ ఎమ్మెల్యే దళితులను కొడతాడని,, మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యకారులను భూతులు తిడతారని, ఇదేనా మీ సంస్కారం.. ఇదేమైనా మీ సొత్తా అని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు కొంత తన మాటలను అదుపులో పెట్టుకోవాలని పవన్ అన్నారు. బాలకృష్ణ కూడా యువతను ఇష్టారీతిన తిడుతున్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఒకటి ఉన్న కులం, రెండు లేని కులమని, మరో కులం లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను ఎందుకు నమ్మాలని అంటుంటారని, ఓసారి తనను చూడాలన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మన గుండెల్లో చోటు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి వినబడేలా, ప్రధాని నరేంద్ర మోడీకి వినబడేలా వారికి ఇక్కడ స్థానం లేదని చెప్పాలన్నారు. మేం పాతిక కేజీల బియ్యం సంపాదించుకుంటాం, మాకు పాతిక ఏళ్ల జీవితం ఇవ్వాలని యువత కోరుకుంటోందన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో చేసిన తప్పునే అమరావతిలో చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. కొందరు రాజకీయ నాయకుల బిడ్డలే యువత కాదన్నారు. ఉన్నది దోపిడీ చేసే కులం, దోపిడీకి గురయ్యే కులమని చెప్పారు. ఏపీలో దోపిడీ చేసే కులాన్ని నేను సంపూర్ణంగా కూలదోస్తానని చెప్పారు.

నాయకులు లేని జనసేన ఉంటుందేమో కానీ, జనసైనికులు, జనసేన జెండా లేని గ్రామం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. దోపీడీలతో నిండిపోయిన ఈ వ్యవస్థను కూకటివేళ్ళతో పీకివేసి ఒక నవ సమాజాన్ని, ఒక కొత్త రాజకీయ వ్యవస్థను వచ్చే ఎన్నికల్లో నిర్మిద్దామన్నారు. అభిమానులు అరిచే సీఎం సీఎం అనే మంత్రం తనకు భాధ్యతను గుర్తు చేస్తుందని, శ్రీ పాద వల్లభుడు నివసించిన గోదావరి ప్రాంతం, మీరు పఠించే ఈ మంత్రం తప్పకుండా నిజమవుతుందన్నారు.

జనసేన పార్టీలోకి వచ్చే నాయకులకు ఒకటే చెప్పానని, 2019 ఎన్నికల్లో సీట్ల కోసం కాకుండా 25 సంవత్సరాల సుదీర్ఘ సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు పని చేయాలని సూచించానని అన్నారు. అనంతపురం నుంచి మధుసూదన రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఏపీలో జన సైనికులు లేని గ్రామం లేదన్నారు.