బాలీవుడ్ లవ్ బర్డ్స్ వెడ్డింగ్: లేక్ కోమో

Posted on : 12/11/2018 08:51:00 pm


బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం నవంబర్ 14, 15 తేదీల్లో జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఇటలీలోని లేక్ కోమో వీరి వివాహానికి వేధిక కానుంది. అయితే వీరు తమ డెస్టినేషన్ వెడ్డింగుకు ఈ ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది. ఉత్తర ఇటలీలోని ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం సుందరమైన ఈ ప్రదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే. ముఖ్యంగా హాలీవుడ్ మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ హాలీవుడ్ మూవీలో నటించిన దీపిక తన స్టేటస్‌కు తగిన విధంగా ఉంటుందనే ఈ ప్రదేశాన్ని ఎంచుకుంది.

ఇటాలియన్ ఆర్కిటెక్చర్‌తో కూడిన అక్కడి కట్టడాలు.... వివాహ వేడుకకు రాయల్ లుక్ తెస్తుంది. అన్నింటినీ మించి అద్భుతమైన ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రపంచ ప్రఖ్యాత ప్రదేశాల్లో ఒకటిగా ఈ ప్రాంతం ఉంది.

లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియానెల్లో అనే ప్యాలెస్‌లో రణవీర్, దీపిక వివాహం జరుగబోతోంది. పెళ్లి వేడుక జరిగే రెండు రోజులు ఆ ప్రాంతంలోకి టూరిస్టులను అనుమతించరట. ఈ మేరకు అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

దీపిక, రణవీర్ ఆదివారమే కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఓ వెడ్డింగ్ ఏజెన్సీ లేక్ కోమోలో వీరి పెళ్లి వేడుకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ వెడ్డింగ్స్‌లో ఒకటిగా రణవీర్-రణవీర్ దీపిక వివాహం చరిత్రకెక్కుతుందని అంటున్నారు.

రణవీర్, దీపిక వివాహం జరిగే విల్లా దెల్ బాల్బియానెల్లో ప్యాలెస్ టాప్ వ్యూ ఇక్కడి ఫోటోలో చూడొచ్చు. ఎవరి జీవితంలో అయినా వివాహ వేడుకను మించిన పెద్ద వేడుక ఉండదు. అలాంటి వేడుకను ప్రత్యేకంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ అందమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు.